ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను( Boyapati Srinu ) మళ్లీ నిరాశ పరిచాడు.ఆ మధ్య రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా తో డిజాస్టర్ ను చవి చూసిన విషయం తెల్సిందే.
రామ్ చరణ్ అభిమానులు ఆ సమయంలో బోయపాటి ని ఏ స్థాయి లో విమర్శించారో అందరికి తెల్సిందే.రామ్ చరణ్ వంటి సూపర్ స్టార్ తో సినిమా తీయడం బోయపాటికి చేతనవ్వలేదు అన్నట్లుగా విమర్శలు చేసిన వారు ఉన్నారు.
ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని అఖండ సినిమా ను బాలయ్య( Nandamuri Balakrishna ) తో రూపొందించాడు.బాలయ్య తో అంతకు ముందు సింహా మరియు లెజెండ్ సినిమా లను రూపొందించిన బోయపాటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.అఖండ సినిమా తో హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.బాలయ్య తో అఖండ చేసి మంచి జోష్ మీదున్న బోయపాటి తో రామ్ సినిమా ను చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత చిత్రాల ఫలితాల నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నాడు.అయినా కూడా ఫలితం తారు మారు అయింది.
రామ్( Ram Pothineni ) కి తీవ్రంగా నిరాశ కలిగించింది.బాలయ్య కి తప్ప మరే హీరో కి కూడా బోయపాటి కథ లు సెట్ అవ్వవు అని మళ్లీ నిరూపితం అయింది.అందుకే బాలయ్య తోనే మళ్లీ బోయపాటి సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్కంద సినిమా ( Skanda movie )నిరాశ పరిచిన నేపథ్యం లో వెంటనే బోయపాటి తన కిటీ లో ఉన్న అఖండ 2 ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు.
స్కంద సినిమా కి ముందు బాలయ్య తో బోయపాటి సినిమా చేయాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఫైనల్ అవ్వలేదు.బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా లు పూర్తి అయిన వెంటనే అఖండ 2( akhanda 2 movie ) సినిమా మొదలు పెట్టాలని బోయపాటి మరియు నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరి బోయపాటి మాట ఏంటి అనేది చూడాలి.