యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్” ఒకటి.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఈ క్రమంలోనే ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సలార్ వాయిదా అంటూ చెప్పి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చారు.
అన్ని బాగుండి ఉంటే ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఉండేది.కానీ మేకర్స్ ఈ నెల రిలీజ్ కాకుండా వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ తాజాగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసారు.గత కొద్దీ రోజులుగా ఈ సినిమా రిలీజ్ పై పలు ఊహాగానాలు వస్తున్న విషయం విదితమే.
ఇక డిసెంబర్ లో మేకర్స్ ఫిక్స్ చేసారని క్రిస్మస్ కానుకగా( Christmas ) ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని టాక్ వచ్చింది.ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అఫిషియల్ గా అప్డేట్ తెలిపారు.ప్రభాస్ ఊర మాస్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని తెలిపారు.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక ప్రభాస్ పోస్టర్ కూడా అందరిని ఆకట్టు కుంటుంది.ఒంటి నిండా రక్తంతో ఉన్న ప్రభాస్ వైల్డ్ లుక్ ను రిలీజ్ చేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.
రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.చూడాలి ప్రభాస్ ఖాతాలో ఇదైనా హిట్ అవుతుందో లేదో.