తెలంగాణ (Telangana) లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి పైళ్ల శేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు.
రాబోవు ఎన్నికల్లో కూడా టికెట్టు మళ్లీ ఆయనకి కేటాయించారు సీఎం కేసీఆర్(CM KCR).ఇదే తరుణంలో ఈ నియోజకవర్గంలో నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.
కానీ ఆయన చిన్న చిన్న గొడవల వల్ల ఇదే ఏడాది జులై 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అయితే ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల సాంకేతాలు లేకపోవడంతో పప్పులో కాలేశానని గ్రహించినట్టున్నాడు.
తిరిగి తన సొంత గూడు కాంగ్రెస్ పార్టీలోకి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో చేరారు.దీంతో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ టికెట్ గొడవ మొదలైంది.

అయితే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbham Anil Kumar Reddy), బీఆర్ఎస్ లోకి వెళ్ళగానే , బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి కాంగ్రెస్ టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు.బాలకృష్ణారెడ్డి కూడా తన ప్రచారాన్ని మొదలుపెట్టారు.ఇంతలో అనూహ్య మార్పు వచ్చింది.బీఆర్ఎస్ లో పోసగలేని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మళ్లీ కాంగ్రెస్ టికెట్ అనిల్ కుమార్ రెడ్డికి వెళుతుందనే ప్రచారం సాగుతోంది.

ఇదే తరుణంలో అక్కడ జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna reddy), కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెండు వర్గాలు ఏర్పడ్డాయి.టికెట్ విషయంలో ఇద్దరు నాయకులు తర్జనభర్జన అవుతున్నారు.ఇందులో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తంకుమార్ రెడ్డి మద్దతు కూడా ఉంది.ఇక జిట్టా బాలకృష్ణారెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఉంది.
ఇదే తరుణంలో టికెట్ ఎవరికి వస్తుందనే దానిపై చాలా ఆసక్తి నెలకొంది.దీంతో ఇద్దరు నాయకుల మధ్య టిక్కెట్టు నీదా నాదా అనే విధంగా లోలోపల పోరు జరుగుతుందని తెలుస్తోంది.







