పవన్ వ్యూహాలు ఫలించాయా ?

పార్టీని ఎలా ముందుకు నడిపించాలి ? ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ? అనే విషయాలను తనకు వదిలేయాలని, సరైన టైమ్ లో సరైన వ్యూహాలను అమలు చేస్తానని పవన్ ( Pawan )మొదటి నుంచి కూడా తన పార్టీనేతలకు చెబుతూ వచ్చారు.ఆయన అన్నట్లుగానే టైమ్ చూసి వ్యూహాలను అమలు చేస్తూ సక్సస్ సాధిస్తున్నారు.

 Did Pawan's Strategies Work , Pawan, Bjp, Tdp ,janasena , Chandrababu, Politics-TeluguStop.com

మొదటి నుంచి బీజేపీతో( BJP ) దోస్తీలో ఉన్న పవన్.చంద్రబాబు ( Chandrababu )అరెస్ట్ కాగానే టిడిపితో పొత్తు ప్రకటించి సరికొత్త స్ట్రాటజీకి తెరతీశారు.

నిజానికి టీడీపీ జనసేన( TDP ,Janasena ) మద్య అంతర్గత పొత్తు ఉందనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట.కానీ పొత్తును ఎప్పుడు అధికారికం చేయని పవన్.చంద్రబాబు జైల్లోకి వెళ్ళగానే ఊహించని విధంగా పొత్తు కన్ఫర్మ్ చేశారు.ఇక బీజేపీ కూడా టీడీపీతో కలిసేందుకు మార్గం సిద్దం చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan, Pawan Kalyan-Politics

జనసేన అండ లేనితే ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు.దీంతో జనసేన వెళ్ళే రూట్లోనే బీజేపీ కూడా వెళ్ళాక తప్పదు.దాంతో టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు ఎంతో దూరంలో లేదనేది కొందరి అభిప్రాయం.కూటమి కన్ఫర్మ్ అయితే పవన్ మరో వ్యూహానికి తెర తీస్తే అవకాశం ఉంది.

అదే సి‌ఎం అభ్యర్థిత్వం.ప్రస్తుతం టీడీపీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది.

దాంతో సి‌ఎం అభ్యర్థి విషయంలో వెనుకడుగు వేసిన ఆశ్చర్యం లేదు.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan, Pawan Kalyan-Politics

ఇక బీజేపీ తో పోల్చితే ఏపీలో జనసేన బలమే అధికం.అందుకే కూటమి కన్ఫర్మ్ అయితే సి‌ఎం అభ్యర్థిగా పవనే ఉండేలా ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు.మొత్తానికి తాజా పరిస్థితులన్నీ పవన్ కె అనుకూలంగా మారుతూ ఆయన వ్యూహాలు ఫలిస్తున్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరి సీట్ల విషయంలో కూడా ఓ స్పష్టత వస్తే కూటమి సి‌ఎం అభ్యర్థిగా ప్రచారానికి వెళ్లాలనేది పవన్ ప్లాన్ గా తెలుస్తోంది.మరి పవన్ వ్యూహాలు ఎంతవరు ఫలిస్తాయో చూడాలి.

ప్రస్తుతం పవన్ వారాహినాలుగో యాత్రకు సిద్దమౌతున్నారు.మరి ఈ యాత్రలో భాగంగా సి‌ఎం అభ్యర్థి విషయంలో పవన్ ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube