మిల్కీ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది.ముఖ్యంగా సౌత్ లో ఈమె ఏ స్థాయి లో సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పదేళ్ల పాటు టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచి రికార్డు స్థాయి సినిమా లు చేయడం తో పాటు అత్యధిక పారితోషికం దక్కించుకోవడం, అత్యధిక విజయాలను సొంతం చేసుకోవడం చేసింది.అయినా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా కు సౌత్ సినీ ఇండస్ట్రీ ( South Cine Industry )అంటే కోపం అన్నట్లుగా ఉంది.
ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా ( Tamannaah Bhatia )కి సౌత్ లో ఇప్పుడు హీరో ల డామినేషన్ కనిపిస్తోందట.ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా కి ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇతర సౌత్ సినీ ఇండస్ట్రీ ల్లో హీరో ల డామినేషన్ కనిపించడం తో ఇబ్బందిగా ఉందట.ఇన్నాళ్లు సినిమా ల్లో ఆఫర్ల కోసం సౌత్ సినీ ఇండస్ట్రీ పై చిన్న మాట కూడా అనని తమన్నా ఇప్పుడు ఎలాగూ ఆఫర్లు తగ్గాయి కనుక.పెద్ద హీరోల సినిమా ల్లో ఎలాగూ ఛాన్స్ లు రావు కనుక ఇష్టానుసారంగా మాట్లాడేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయం లో మిల్కీ బ్యూటీ తమన్నా( Milky buty tamannah ) వ్యాఖ్యలు నార్మల్ గా అనిపించినా కూడా కచ్చితంగా ఆమె పై సౌత్ స్టార్ హీరోలు తీవ్రంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి.ముందు ముందు సౌత్ లో ఆమెకు చిన్నా చితకా ఆఫర్లు కూడా దక్కక పోవచ్చు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా వ్యాఖ్యల గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.