నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.ఇలా నటుడిగా బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి ( Anil Ravupudi ) దర్శకత్వంలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎంతో శరవేగంగా తెరకెక్కిన ఈ సినిమా దసరా పండుగను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

బాలయ్య నటించిన ఆఖండ, వీరసింహారెడ్డి ( Veera Simha Reddy )వంటి సినిమాలు వరుస బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు డిజాస్టర్ అనే టాక్ రాలేదు.ఈయన సినిమాలన్నీ కూడా నిర్మాతలకు మంచి లాభాలని అందించాయి.అదే ఉద్దేశంతోనే బాలయ్య సినిమాపై కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది.ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలందరూ కూడా భాగమయ్యారు దీంతో సినిమా ఖర్చు కూడా భారీగానే వచ్చిందని తెలుస్తుంది.

బాలయ్య అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా కోసం దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది.మరి బాలయ్య అనిల్ రావిపూడి సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తే తిరిగి ఆ డబ్బులు ఈ సినిమా రాబట్టగలదా అన్న సందేహం అందరిలో ఉంది.అయితే ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంలో సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమా విడుదల సమయంలో మరికొన్ని సినిమాలు కూడా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించగలరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవైపు కోలీవుడ్ నటుడు విజయ్ ( Vijay ) నటించిన లియో సినిమా దసరా బరిలోని దిగబోతుంది.అలాగే రవితేజ( Raviteja ) టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా దసరా బరిలోనే దిగుతోంది దీంతో ఈ సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయగా ఆ డబ్బులు తిరిగి వస్తాయా అన్న సందేహం మాత్రం అందరిలోనూ ఉందని చెప్పాలి.
మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.