యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను( Jr NTR ) దగ్గరినుంచి చూసిన వాళ్లు మాత్రమే ఆయన మంచి మనస్సును అర్థం చేసుకుంటారు.ప్రముఖ నటుడు, పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్( Shivaraj Kumar ) తాజాగా ఒక సందర్భంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ అవుతున్నాయి.
శివరాజ్ కుమార్ నటించిన ది ఘోస్ట్ మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించడం గమనార్హం.
మహేష్ తో దిగిన ఫోటో గుర్తుందా అనే ప్రశ్నకు శివరాజ్ కుమార్ స్పందిస్తూ మహేష్ బాబుది విశాల హృదయమని మహేష్ బాబు( Mahesh Babu ) ప్రొఫెషనల్, డిగ్నిఫైడ్ అని పేర్కొన్నారు.మహేష్ బాబు తక్కువగా మాట్లాడతాడని అయినప్పటికీ ప్రొఫెషనల్ గా ఉంటాడని శివరాజ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ది విశాల హృదయమని కన్నడలో మాట్లాడాలంటే మంచి మనస్సు, విశాల హృదయం ఉండాలని కామెంట్లు చేశారు.ఆ మంచి మనస్సు తారక్ కు ఉందని జూనియర్ ఎన్టీఆర్ కన్నడలో( Kannada ) మాట్లాడటంతో పాటు కన్నడలో పాట కూడా పాడాడని ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ గుర్తు చేశారు. తారక్ ఫ్యాన్స్ అంటే నాకూ ఇష్టమే అని మా ఫ్యామిలీ తారక్ ను ప్రేమిస్తుందని ఆయన తెలిపారు.

శివరాజ్ కుమార్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాతో( Ghost Movie ) భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సైతం శివరాజ్ కుమార్ సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
శివరాజ్ కుమార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.







