తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.ఆలయం వెలుపల భాను ప్రకాష్ మాట్లాడుతూ తిరుమల భద్రత విభాగం విఫలమైందన్నారు.
15 రోజుల లో హెల్త్ ఆఫీసర్ కారును, శ్రీవారి ధర్మ రథం బస్సు దొంగతనానికి గురైన భద్రత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తిరుమలలో సీసీ కెమెరాలన్నీగా ఉన్న దొంగలను ఇంతవరకు పట్టుకోక పోవడం శ్రీవారి భద్రత విభాగం విఫలమే అన్నారు.టీటీడీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం భద్రతను కోరాలని భాను ప్రకాష్ రెడ్డి సూచించారు.







