కన్నతల్లి ఆశయాలను, కలలను నెరవేర్చే వాళ్లు ఈ జనరేషన్ లో తక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే.తల్లి తన కొడుకు ఐఏఎస్ కావాలని కోరుకోవడంతో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సివిల్స్ కు ప్రిపేరై మను చౌదరి లక్ష్యాన్ని సాధించారు.
తల్లి గర్వించే స్థాయికి ఎదిగి ఎంతోమంది స్టూడెంట్స్ కు స్పూర్తిగా నిలవడంతో పాటు మను చౌదరి ప్రశంసలు అందుకున్నారు.రెండేళ్ల పాటు సివిల్స్ కోసం కష్టపడిన మను చౌదరి సులువుగానే తన లక్ష్యాన్ని సాధించారు.
ఖమ్మంకు జిల్లాకు చెందిన మను చౌదరి కొంతకాలం క్రితం వరకు నాగర్ కర్నూల్ లో అదనపు పాలనాధికారిగా పని చేశారు.ప్రస్తుతం బదిలీపై వచ్చిన మను చౌదరి ఖమ్మం జిల్లా( Khammam District )లో బాధ్యతలు చేపట్టారు.మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తైన వెంటనే సివిల్స్ సాధించాలనే ఆలోచనతో మను చౌదరి ఢిల్లీలో ఎంబీఏ( DELHI ) చదువుతూనే ప్రిపరేషన్ మొదలుపెట్టారు.రెండు సంవత్సరాల పాటు రోజుకు పన్నెండు గంటలు బుక్స్ లోకంగా మను చౌదరి ప్రిపేర్ అయ్యారు.
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించానని మను చౌదరి( Manu chowdary ) కామెంట్లు చేశారు.విద్యార్థులకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునేందుకు పేరెంట్స్ అవకాశం కల్పించాలని మను చౌదరి అన్నారు.సివిల్స్ కు ఎన్.సీ.ఈ.ఆర్.టీ పుస్తకాలు చదివానని ఆ సమయంలో రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయానని మను చౌదరి చెప్పుకొచ్చారు.గెలుపుకు భాష అడ్డు కాదని తెలుగు మీడియంలో చదివి తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చి ర్యాంకులు సాధించిన వాళ్లు ఉన్నారని మను చౌదరి కామెంట్లు చేశారు.
మను చౌదరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మను చౌదరి సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మను చౌదరి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.