సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ ( Nereducharla )పరిధిలోని నరసయ్యగూడెంలో అంబేడ్కర్ భవనానికి కేటాయించిన స్థలంలో చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని మంగళవారం నేరేడుచర్ల తాహాసిల్దార్ కు గ్రామానికి చెందిన ఎస్సీ యువకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసయ్యగూడెంలోని సర్వే నెంబర్ 92 లో సుమారు రెండు కుంటల స్థలం బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి( Bellamkonda Shyams undar Reddy ) ఆక్రమించి,అక్రమ పట్టా సృష్టించి,ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ స్థలాన్ని అప్పటి తాహాసిల్దార్ అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.
అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై కఠిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని తాహాసిల్దార్( Tahsildar ) ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ యువకులు శ్రీను( Srinu ),భిక్షం, వెంకన్న,రామలింగయ్య,కృష్ణ,నాగరాజు,రమేష్త దితరులు పాల్గొన్నారు
.