ప్రస్తుత సమాజంలోనే కాకుండా పూర్వం రోజుల నుంచి అమ్మాయిలకు అందం( Beauty )పై, నగలపై ఎంతో ఇష్టం ఉంటుంది అని కచ్చితంగా చెప్పవచ్చు.వారు బయటకు వెళ్తే అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.
కేవలం అమ్మాయిలే కాకుండా దాదాపు మహిళలందరూ ఇలాగే అనుకుంటూ ఉంటారు.అయితే అందర్నీ మరింత ఆకర్షణీయంగా చూపించుకునేందుకు మహిళలు అనవసరపు కెమికల్స్( Chemicals ) తో కూడిన క్రీమ్స్ ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
అవి వెంటనే ఫలితం కనిపించుకున్న కనిపించకుండా కొన్ని రోజుల తర్వాత చర్మ సమస్యలు( Skin problems ) వస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే చాలామంది మహిళలు లిప్ స్టిక్ పై అనారోగ్యకర కెమికల్స్ ఉపయోగించిన లిప్స్టిక్స్ ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

కొంతమంది నార్మల్ గా పార్టీ ఫంక్షన్స్ టైం లో ఉపయోగించగా మరి కొంతమంది డైలీ పెదాలకు లిప్ స్టిక్( Lipstick ) ఉపయోగిస్తూ ఉంటారు.అందంగా కనిపించేందుకు అనేక రకాల బ్రాండ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.కానీ వీటిని వాడే ముందు దాని వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఎవరు ఆలోచన చేయరు.అందులో ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేస్తారు.ఒకవేళ వీటిని ఉపయోగిస్తే మనకు హాని కలుగుతుందా అనే ఆలోచించే ప్రయత్నం ఎవరు చేయరు.చిన్నపిల్లల నుంచి పెద్దవారు 80 శాతం పెదాలను ఆకర్షణంగా మార్చే లిప్ స్టిక్ ఎంత ప్రమాదకరమో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దీని గురించి చెప్పే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే లిప్ స్టిక్ తయారీలో సీసం, మాంగనీస్, మెగ్నీషియం వంటి రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ఇలా ఉపయోగించడం వల్ల శరీరంలో అలర్జీల సమస్య ( Allergies problem )వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.పెదాలకు ఉపయోగించే సౌందర్య సాధనాలలో ఎన్నో రసాయనలు ఉపయోగిస్తారు.ఇలా ఉపయోగిస్తే నోటి నుంచి నేరుగా కడుపులోకి వెళ్తుంది.ఫలితంగా పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే గర్భిణీ మహిళలు లిప్ స్టిక్ ఉపయోగించడం ఎంతో ప్రమాదకరం.ఇందులో కెమికల్స్ నోట్లోకి వెళ్తే తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదకరమే అని నిపుణులు చెబుతున్నారు.
వీటి తయారీలో క్యాన్సర్( Cancer ) కు కారణం అయ్యే పెట్రో కెమికల్స్ ను కూడా ఉపయోగిస్తారు.ఇవి మానవుని ఇంటెలిజెన్స్ శరీర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి లిప్ స్టిక్ ను ఉపయోగించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.