అంబేద్కర్ కమ్యూనిటీ భవన స్థలం కబ్జా
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపాలిటీ ( Nereducharla )పరిధిలోని నరసయ్యగూడెంలో అంబేడ్కర్ భవనానికి కేటాయించిన స్థలంలో
చేస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని మంగళవారం నేరేడుచర్ల తాహాసిల్దార్ కు గ్రామానికి చెందిన ఎస్సీ యువకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసయ్యగూడెంలోని సర్వే నెంబర్ 92 లో సుమారు రెండు కుంటల స్థలం బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి( Bellamkonda Shyams Undar Reddy ) ఆక్రమించి,అక్రమ పట్టా సృష్టించి,ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ స్థలాన్ని అప్పటి తాహాసిల్దార్ అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి కేటాయించినట్లు తెలిపారు.
అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై కఠిన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని తాహాసిల్దార్( Tahsildar ) ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ యువకులు శ్రీను( Srinu ),భిక్షం, వెంకన్న,రామలింగయ్య,కృష్ణ,నాగరాజు,రమేష్త దితరులు పాల్గొన్నారు.
రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?