ప్రస్తుతం ఏపీ రాజకీయాలు టీడీపీ( TDP ) చుట్టూనే తిరుగుతున్నాయి.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆ పార్టీని స్కామ్ లు చుట్టూముడుతున్నాయి.
మొన్నటివరకు ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ముందుకు పర్యటనలు, పాదయాత్రలు చేస్తూ తెగ హడావిడి చేసిన టీడీపీ అధిష్టానం అధినేత అరెస్ట్ తో ఒక్కసారిగా డీలా పడింది.ఊహించని పరిణామం ఎదురు కావడంతో దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయింది.2015లో స్టార్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో పక్కా ఆధారాలతో చంద్రబాబును( Chandrababu ) దోషి గా తేల్చిన సీఐడీ.ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ ( Nara Lokes ) పై కూడా గట్టిగానే దృష్టి పెట్టింది.

గత ప్రభుత్వ హయంలో జరిగిన స్కామ్ లలో లోకేశ్( Nara Lokes ) పాత్రనే ఎక్కువగా ఉందని వైసీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.ఆ ఆరోపణలకు తగినట్లుగానే సీఐడీ కూడా లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.తాజాగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు స్కామ్ లో లోకేశ్ పేరు ను ఏ14 గా ప్రకటించింది.దీంతో రాష్ట్ర రాజకీయలు మరోసారి వేడెక్కాయి.ఈ స్కామ్ తో పాటు ఫైబర్ స్కామ్ లో కూడా లోకేశ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.అలాగే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ఇంప్లుమెంటేషన్ లో కూడా లోకేశ్ పాత్రనే ఎక్కువట.

దీంతో స్కామ్ ల విషయంలో లోకేశ్ తన తండ్రి చంద్రబాబునే మించిపోయాడని వైసీపీ( YCP ) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు;.ఇక ఇటీవల డిల్లీ వెళ్ళిన లోకేశ్ కేంద్ర పెద్దలతో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారట.అయితే ఆయన అరెస్ట్ భయంతోనే డిల్లీ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి.అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే కేంద్ర పెద్దల సహాయం కోరాడని వినికిడి.మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడం, పార్టీ అధినేతలు ఒక్కొక్కరిగా జైలు బాట పడుతుండడంతో టీడీపీ నేతలు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారట ప్రస్తుతం జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.ఇలాంటి నేపథ్యంలో లోకేశ్ కూడా అరెస్ట్ అయితే టీడీపీ పనైపోయినట్లే అనే వార్తలు వస్తున్నాయి.
మరి ఏం జరుగుతుందో చూడాలి.







