స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Star Director Rajamouli ) ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తూ నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తోంది.జక్కన్న ప్రమోషన్స్ చేసిన సినిమాలు సైతం నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
అయితే అక్కినేని అఖిల్ కోసం రాజమౌళి కొన్నిరోజుల సమయాన్ని కేటాయించడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.అఖిల్ తర్వాత మూవీ ధీర స్క్రిప్ట్ వర్క్ లో జక్కన్న జోక్యం చేసుకుంటున్నారని భోగట్టా.

నాగార్జున( Nagarjuna ) ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో రాజమౌళి ఈ విధంగా చేశారని తెలుస్తోంది.అఖిల్ జాతకాన్ని రాజమౌళి దెబ్బకు మార్చేస్తాడని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.అక్కినేని అఖిల్ ధీర సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
సినిమా సినిమాకు అఖిల్ మార్కెట్ పెరగాలని అఖిల్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.అఖిల్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.
అఖిల్ సైతం ఏజెంట్( Agent Movie 0 రిజల్ట్ తర్వాత సైలెంట్ గా ఉన్నారు.ఈ నెల 29వ తేదీ నుంచి ఏజెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) ఇప్పటికే పలు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోగా ఏడేళ్ల క్రితం అఖిల్ కెరీర్ ను మొదలుపెట్టినా కెరీర్ పుంజుకోలేదు.అక్కినేని అఖిల్ జాతకం కూడా అనుకూలంగా లేదని వేణుస్వామి పలు సందర్భాల్లో వెల్లడించారు.సినిమా సినిమాకు అఖిల్ కు క్రేజ్ పెరుగుతోంది.
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.







