సుప్రీంలో చంద్రబాబు, కవిత కేసుల విచారణ లేనట్లే..!!

టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుల విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో లేనట్లేనని తెలుస్తోంది.క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఇవాళ్టి సుప్రీంకోర్టు కేసుల జాబితాలో మార్పులు చేశారు.

 It's Like There Is No Trial Of Chandrababu And Kavitha Cases In The Supreme Cour-TeluguStop.com

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ తో పాటు కోర్టు నెంబర్ 2 లో కేసుల విచారణకు అవకాశం లేదు.ఈ క్రమంలోనే చంద్రబాబు కేసుపై ప్రస్తావన, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఈడీ కేసుల విచారణ నేడు జరగే అవకాశం లేదని తెలుస్తోంది.

సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్ పై స్పెషల్ బెంచ్ సమావేశం జరగనుంది.స్పెషల్ బెంచ్ సమావేశం నేతృత్వంలో సీజేఐ చంద్రచూడ్ ఈరోజు ప్రస్తావనలు అనుమతించడం లేదు.

మరోవైపు ఈనెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండనున్నాయి.ఈ నేపథ్యంలో ఇవాళ్టి జాబితాలో కేసులు వచ్చే వారానికి వాయిదా పడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube