టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పథకం ప్రకారమే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగిందని తెలిపారు.
చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ఉన్నాయన్న మంత్రి బొత్స డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి ఆయన ప్రభుత్వ సొమ్ము చెల్లించారని ఆరోపించారు.సీఐడీ అధికారుల విచారణలో మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.
తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.అవినీతి చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని వెల్లడించారు.
ఈ క్రమంలోనే అవినీతికి పాల్పడ్డ అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.







