యూజర్లకు ఫేస్ బుక్( Facebook ) సంస్థ గుడ్ న్యూస్ అందించింది.ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెటా సెప్టెంబర్ 22న ఫేస్‌బుక్‌కు సంబంధించి పెద్ద ప్రకటన చేసింది.
ఫేస్‌బుక్‌లో మెటా( Meta ) మరో కొత్త ఫీచర్‌ను జోడించింది.ఫేస్‌బుక్‌లో ఈ కొత్త ఫీచర్ సహాయంతో, వ్యక్తులు వారి ఖాతాతో ఒకటి కంటే ఎక్కువ ప్రొఫైల్‌లను సృష్టించవచ్చు.
బహుళ ప్రొఫైల్‌లను సృష్టించడానికి ఇష్టపడే వ్యక్తులు ఈ కొత్త ఫీచర్ నుండి ప్రయోజనం పొందుతారు.మెటా ఫేస్‌బుక్‌కు మల్టీ పర్సనల్ ప్రొఫైల్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఒకే యూజర్ ఫేస్‌బుక్‌లో నాలుగు విభిన్న ప్రొఫైల్‌లను సృష్టించగలుగుతారు.మెటా గత సంవత్సరం ఫేస్‌బుక్‌లో మల్టీ ప్రొఫైల్‌లను పరీక్షించడం ప్రారంభించింది.
ఇప్పుడు దాన్ని అందరికీ పరిచయం చేయాలని నిర్ణయించుకుంది.
![Telugu Latest, Meta, Tech-Latest News - Telugu Telugu Latest, Meta, Tech-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/You-Can-Now-Have-Multiple-Personal-Profiles-on-Facebook-detailsa.jpg)
కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు తమ విభిన్న ప్రొఫైల్‌లలో వివిధ రకాల కంటెంట్‌ను షేర్ చేయగలరు.అన్ని ప్రొఫైల్‌ల ఫీడ్ భిన్నంగా ఉంటుంది.ఇది కాకుండా, లాగిన్ బటన్ ద్వారా యూజర్లు వారి విభిన్న ప్రొఫైల్‌లకు మారగలరు.
అయితే, మల్టీ అకౌంట్లను( Multi Accounts ) క్రియేట్ చూసే యూజర్లు డేటింగ్, మార్కెట్‌ప్లేస్, ప్రొఫెషనల్ మోడ్, పేమెంట్ వంటి ఫీచర్‌లకు యాక్సెస్‌బిలిటీని కలిగి ఉండరు.రాబోయే నెలల్లో అదనపు ప్రొఫైల్‌లకు మెసెంజర్ ( Messenger ) మద్దతును తీసుకురావాలని మెటా యోచిస్తోంది.
కొత్త ఫీచర్ల విషయానికొస్తే, మీరు ప్రతి ప్రొఫైల్‌కు నోటిఫికేషన్‌లు, ప్రొఫైల్ సెట్టింగ్‌లను సెట్ చేయగలరు.మరొక ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్‌లు అమలు అవుతాయి.
![Telugu Latest, Meta, Tech-Latest News - Telugu Telugu Latest, Meta, Tech-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/You-Can-Now-Have-Multiple-Personal-Profiles-on-Facebook-detailss.jpg)
మెసేజింగ్ సౌకర్యం మునుపటిలాగే అందుబాటులో ఉంటుంది.కానీ ఇది అన్ని ప్రొఫైల్‌లకు ఒకే విధంగా ఉంటుంది.ప్రస్తుతం అదనపు ప్రొఫైల్‌లతో మెసేజింగ్ సౌకర్యం అందుబాటులో ఉండదు.కొత్త ఫీచర్‌ని ప్రారంభించడానికి మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.ముందుగా ఫేస్‌బుక్‌లోని మీ ప్రొఫైల్‌కు వెళ్లండి.అక్కడ మీరు పై భాగంలో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసే ఆప్షన్ చూస్తారు.
మీరు ఆ ఆప్షన్‌ను ఎంచుకుని, ఆపై మీ ప్రొఫైల్ కోసం పేరును యాడ్ చేయాలి.ఇప్పుడు తదుపరి దశలో మీరు మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ కోసం కొత్త యూజర్ పేరును జోడించాలి.
ఇలా లాగౌట్ కాకుండానే మీరు విభిన్న అకౌంట్లను యూజ్ చేసుకునే వీలుంటుంది.