Manchu Vishnu : మంచు విష్ణుకి ఊహించని షాకిచ్చిన హీరోయిన్.. భక్త కన్నప్ప నుంచి తప్పుకోవడంతో?

టాలీవుడ్ హీరో మంచి విష్ణు( Manchu vishnu ) డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ సినిమాలో ఇప్పటికే పాన్ ఇండియా హీరోలు అయినా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్( Prabhas Jr.

 Nupur Sanon Out From Manchu Vishnu Dream Project Kannappa-TeluguStop.com

NTR ) నటించబోతున్నట్లు ఇప్పటికే మంచు విష్ణు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నుపూర్ సనన్ ( Nupur sanon )ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తాజాగా హీరో మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఇలా హీరోయిన్ తప్పుకోవడం ఏమిటా? అని అనుకుంటుండగా మంచు విష్ణు అందుకు కారణాన్ని కూడా తెలిపారు.భక్త కన్నప్ప చిత్రానికి డేట్స్‌ సర్దుబాటు చేసే విషయంలో సమస్యలు తలెత్తడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ నుపుర్‌ సనన్‌ తప్పుకుంది.

ఈ విషయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది.ఆమెను ఎంతో మిస్ అవుతున్నాము.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో చేయబోయే నూతన నటీమణి కోసం సెర్చింగ్ మొదలెట్టాము.

ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ నుపుర్‌ సనన్ ( Nupur sanon )భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.అలాగే మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం భవిష్యత్‌లో ఉంటుందని ఆశిస్తున్నాను.ఆసక్తికరమైన రోజులు రాబోతున్నాయి.అప్‌డేట్స్‌ కోసం రెడీగా ఉండండి అని మంచు విష్ణు తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.ఈ సినిమా పట్ల మంచు ఫ్యామిలీ చాలా ప్రత్యేకంగా కేర్ తీసుకుంటోంది.అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా వ్యవహరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube