టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్”( Pushpa the Rule ) ఒకటి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.
అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.
దీంతో ఈ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు.ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగం లోకి దించుతున్నట్టు టాక్ వినిపిస్తుంది.పార్ట్ 1 లో స్టార్ హీరోయిన్ సమంతతో ఐటెం సాంగ్ చేయించి యూత్ తో ”ఊ అంటావా మావ ఊఊ అంటావా” అని స్టెప్పులు వేయించారు.ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా పార్ట్ 2 లో ఐటెం సాంగ్ ను ప్లాన్ చేసారని తెలుస్తుంది.
ఈ సాంగ్ ను బిటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తో చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అలాగే జాన్వీ కపూర్ తో థియేటర్స్ ఊగిపోయేలా స్టెప్పులు వేయించబోతున్నట్టు టాక్.మరి జాన్వీ కపూర్ ఈ సాంగ్ లో చిందేయడానికి ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.