కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగునీటి కష్టాలకు చెక్ ..: సీఎం జగన్

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా లక్కసాగరం పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు.

 Check Irrigation Problems In Kurnool And Nandyala Districts: Cm Jagan-TeluguStop.com

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ 77 చెరువులకు నీరు అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.

లక్కసాగరం ఎత్తిపోతల పథకాన్ని దాదాపు రూ.250 కోట్లతో నిర్మించినట్లు సీఎం జగన్ తెలిపారు.గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు.లక్కసాగరం ఎత్తిపోతలతో డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు.77 చెరువుల కింద సుమారు 10,394 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది.గత ప్రభుత్వం టెంకాయ కొట్టడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను చూశానన్న సీఎం జగన్ చెప్పిన మాట ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు.హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు తొమ్మిదేళ్లుగా సీఎంగా ఉండి రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో హంద్రీనీవాకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాగునీటి కష్టాలు తీర్చుతున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube