Karthi Suriya : ఒకే సినిమాలో కలిసి నటించబోతున్న కార్తీ, సూర్య..అభిమానులకు పూనకాలే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు ఒకే సినిమాలో నటించడం అన్నది చాలా అరుదు.అయితే ఎక్కువ శాతం మనం సినిమాలలో రియల్ కొడుకు తండ్రి ఈ సినిమాలలో రియల్ తండ్రి కొడుకులుగా నటిస్తూ ఉంటారు.

 Karthi Going To Act With His Brother Suriya May Be In Lokesh Kanagaraj Movie-TeluguStop.com

అలా రియల్ బ్రదర్స్ కూడా సినిమాలలో రీల్ బ్రదర్స్ గా నటించే అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి.ఇప్పుడు అలా ఒక కాంబినేషన్లో ఒక క్రేజీ మూవీ రాబోతోంది.

ఇంతకీ ఆ ఇద్దరి హీరోలు మరెవరో కాదు కోలీవుడ్ హీరోస్ సూర్య,( Suriya ) కార్తీ.

Telugu Karthi, Kollywood, Suriya-Movie

ఈ మేరకు కార్తీ ( karthi )చిన్న హింట్ ఇవ్వడంతో అందుకు సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సొంత బ్రదర్స్ ఇండస్ట్రీలో ఉండటం అరుదుగా జరుగుతుంది.మేం ఇద్దరం కలిసి ఒక మంచి సినిమా అయితే చేయాలని అనుకుంటున్నాము.

మొదట్లో కలిసి నటించాలంటే భయపడే వాడ్ని.కానీ ఇప్పుడు కచ్చితంగా ఒక సినిమా అయితే చేయాలని ఫిక్స్ అయ్యామన్నట్టుగా కార్తీ చెప్పుకొచ్చాడు.

ప్రతీ సారి నేను ఏదో ఒక ఛాలెంజ్ ఉండాలని అనుకుంటూ ఉంటాను.సినిమా వల్ల నాకు ఎప్పుడూ కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి.

నాకు నటన అనేది ఒక ఆప్షన్.మా డాడీ మాటలతోనే యాక్టింగ్‌లోకి వచ్చాను.

Telugu Karthi, Kollywood, Suriya-Movie

అరవై ఏళ్లు వచ్చాక కూడా డైరెక్షన్ చేయవచ్చు.కానీ హీరోగా, నటుడిగా చేయాలంటే మాత్రం ఒక వయసు వరకే చేయగలం అని మా నాన్న చెప్పాడు.అప్పుడు నేను కన్విన్స్ అయ్యాను అంటూ తన సినీ ఎంట్రీ గురించి కార్తీ చెప్పాడు.దీంతో కార్తీ,సూర్య కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ వార్తలు రాయడం మొదలుపెట్టేశారు.

మరి ఈ వార్తలపై కార్తీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.అంతేకాకుండా సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు లోకేష్ ( Lokesh Kanagaraj )దర్శకత్వం వహించనున్నారని, అలాగే ఇందులో ఖైదీలోని ఢిల్లీ, విక్రమ్ లోని రోలెక్స్ కలుస్తారని, ఆ మూవీ గురించే కార్తీ హింట్ ఇచ్చాడని అంతా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube