ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
గత వారం ఏసీబీ కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.ఈ క్రమంలోనే మొత్తం ఐదు అంశాలను ప్రస్తావించి చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ అడుగుతున్నారు.
చంద్రబాబు జైలులో ఆహారం సరిగా తీసుకోవడం లేదని, అంతేకాకుండా అక్కడ ఆయనకు భద్రత లేదని లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.







