Mahesh Babu : మహేష్ బాబు ఇంట వినాయక చవితి వేడుకలు.. పట్టు పరికిణిలో మెరిసిపోతున్న సితార?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) ముద్దుల కూతురు సితార ( Sitara )ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు కూతురుగా సితార మనందరికీ సుపరిచితమే.

 Hero Mahesh Babu Daughter Sitara Turned Traditional On Vinayaka Chavithi Festiv-TeluguStop.com

చిన్న వయసులోనే భారీగా అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు అప్పుడప్పుడు మంచి మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటూ ఉంటుంది సితార.సేవాగుణంలో మాత్రం తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.

సోషల్ మీడియా( Social media )లో నిత్యం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

Telugu Mahesh Babu, Sitara, Tollywood, Traditional-Movie

డాన్స్ వీడియోలకు సంబంధించి వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది సితార.ఇది ఇలా ఉంటే తాజాగా వినాయక చవితి పండుగ ( Vinayaka chavithi festival )సందర్భంగా సితార పట్టు పరికిణిలో మెరిసిపోయింది.ఇంట్లో మట్టి గణపతిని పూజించి చక్కగా తయారయ్యి స్వామి వారి దగ్గర ఫోటోలు కూడా దిగింది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఘట్టమనేని అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు సితారకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.11 ఏళ్లకే సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న ఈమె సంపాదన విషయంలో కూడా దూసుకుపోతోంది.

Telugu Mahesh Babu, Sitara, Tollywood, Traditional-Movie

ఇక మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార ( Sitara )హోర్డింగ్స్ ప్రదర్శించారు.ప్రఖ్యాత టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార ఫోటోలు దర్శనమివ్వడంతో మహేష్ బాబు మురిసిపోయారు.

ఈ యాడ్ కి సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.తన మొదటి సంపాదన ఛారిటీకి డొనేట్ చేసినట్లు సితార వెల్లడించింది.

పుట్టినరోజు నాడు పేద బాలికలకు సైకిల్స్ తన సంపాదనతో కొనిపెట్టింది.ఆ బాలికల సమక్షంలో బర్త్ డే జరుపుకుంది.

వారితో కాసేపు ముచ్చటించింది.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube