ఆస్ట్రేలియాలోని( Australia ) కాన్‌బెర్రాలో పెద్ద ఫ్లవర్ షో వేడుకలు సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయి.నెలపాటు జరిగే ఈ ఫ్లవర్ షోను ఫ్లోరియాడ్( Floriade ) అంటారు.
ఇది దేశంలో అతిపెద్ద వసంత వేడుక.పువ్వులు, ప్రకృతి, వినోదాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ షో తప్పక సందర్శించాలి.
వసంత ఋతువులో చాలా పువ్వులు వికసిస్తాయి.ఫ్లోరియాడ్ పూల ప్రదర్శన లేక్ బర్లీ గ్రిఫిన్ అనే సరస్సు సమీపంలోని పార్కులో ఉంది.
అక్కడ పది లక్షల కంటే ఎక్కువ పువ్వులు ఉన్నాయి.ఈ సంవత్సరం థీమ్ ‘ఫ్లోరల్ వండర్‌ల్యాండ్’.
( Floral Wonderland ) అక్కడ మీరు చాలా అందమైన వస్తువులను చూడవచ్చు.ఫ్లోరియాడ్‌లో ఐదు యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనవచ్చు.అవేవో చూద్దాం.
• ఫ్లోరియాడ్ నైట్ ఫెస్ట్:
సూర్యుడు అస్తమించిన తర్వాత, ఫ్లోరియాడ్ నైట్ ఫెస్ట్ కోసం ముస్తాబవుతుంది.హార్టికల్చరల్ ఇల్యూమినేషన్‌తో పాటు కొత్త ప్రోగ్రామ్‌తో ఈ షో చాలా ఎగ్జైటింగ్గా మారుతుంది.ఇక్కడ రుచికరమైన ఫుడ్ కూడా దొరుకుతుంది.

• ఎండ్‌లెస్ చిల్డ్రన్స్ ఎంటర్‌టైన్‌మెంట్:
ఫ్లోరియాడ్ అనేది కుటుంబాలకు గొప్ప ప్రదేశం, అన్ని వయసుల పిల్లల కోసం ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి.వారు పూల కిరీటాలను తయారు చేయవచ్చు, చాక్లెట్ మాస్టర్‌క్లాస్‌లు వంటి వాటికి కూడా హాజరు కావచ్చు.
• సర్కస్ వండర్‌ల్యాండ్:
సర్కస్ వండర్‌ల్యాండ్( Circus Wonderland ) నెవర్‌ల్యాండ్ అడ్వెంచర్, ఇక్కడ పీటర్ పాన్, టింకర్ బెల్, స్నేహితుల ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు.ఉత్కంఠభరితమైన విన్యాసాలు, ఉల్లాసకరమైన కార్యకలాపాలతో ప్రతిఒక్కరూ ఆనందించగలిగేవి ఇక్కడ ఉంటాయి.

• ఫర్రీ ఫన్:
ఫ్లోరియాడ్ అనేది కుక్కపిల్లలకు అనుకూలమైన పండుగ, కాబట్టి సరదాగా మీ కుక్కను తీసుకురావొచ్చు.వార్షిక డాగ్స్ డే ఔట్ ఫ్యాషన్ పావ్-రేడ్‌లో బహుమతులు కూడా అందజేస్తారు.
• కాన్‌బెర్రా ఫ్లోరియాడ్ టూర్:
కేవలం ఫ్లోరియాడ్ కంటే ఎక్కువ చూడాలనుకుంటే, కాన్‌బెర్రా ఫ్లోరియాడ్ టూర్ వేయవచ్చు.ఈ కస్టమ్-మేడ్ టూర్ మిమ్మల్ని మరో మూడు అద్భుతమైన ఆకర్షణలకు తీసుకెళ్తుంది.
అందులో నేషనల్ ఆర్బోరేటమ్, తులిప్ టాప్ గార్డెన్స్, కాన్‌బెర్రా స్పేస్ సెంటర్ ఉంటాయి.







