టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు.ఇక బాలయ్య బాబు గత సినిమా వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇక బాలయ్య బాబు తాజాగా నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) త్వరలోనే విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ 90% పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను దసరా పండగకు కానుక విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే త్వరలోనే బాలకృష్ణ దర్శకుడు బాబి( Bobby ) కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో నటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఒక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇంతకీ, విజయ్ సేతుపతి పాత్ర విలన్ పాత్రనా ? లేక సపోర్టింగ్ పాత్రనా అనేది మాత్రం ఇంకా తెలియలేదు.

ఏది ఏమైనా బాలయ్య బాబు విజయ్ సేతుపతి కాంబినేషన్ అంటే అదిరిపోతుంది.ఇక ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయట.మరి ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.కాగా ఈ సినిమాలో బాబీ బాలయ్య ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి మరి.కాగా ఈ మూవీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







