ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు.
జగన్ అరాచక పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.స్కిల్ డెవలప్ మెంట్ పై మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్న అయ్యన్న అందులో పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసిందని చెప్పారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆధారాలు లేవన్నారు.ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని వ్యక్తిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా కలుగజేసుకోవాలని, ఏపీపై దృష్టి సారించాలని కోరారు.