ఈ చైల్డ్ ఆర్టిస్ట్ సంపాదన ఎంతో తెలుసా... ఈమె చాలా కాస్ట్లీ గురూ?

సినిమా అయినా సీరియల్ అయినా చైల్డ్ ఆర్టిస్టుల( Child Artists ) పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పాలి.ఇలా ఎంతోమంది బుల్లితెర సీరియల్స్ లోను అలాగే వెండితెర సినిమాలలోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Child Artist Sara Arjun Remuneration Goes Viral, Sara Arjun,child Artist, Sara A-TeluguStop.com

ఇక చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారందరూ కూడా పెరిగి పెద్దయిన తర్వాత హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదు సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు హీరోయిన్గా కూడా రావడానికి సిద్ధమవుతున్నటువంటి వారిలో సారా అర్జున్ ( Sara Arjun ) ఒకరు.

Telugu Child Artist, Ponniyin Selvan, Sara Arjun-Movie

తమిళనాడుకు చెందిన ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందట.ఐదు సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టినటువంటి సారా అర్జున్ దాదాపు తెలుగు తమిళ హిందీ భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈమె ఒక సినిమాలో నటించాలి అంటే లక్షల్లో రెమ్యూనరేషన్ ( Sara Arjun Remuneration )తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.

Telugu Child Artist, Ponniyin Selvan, Sara Arjun-Movie

అందానికి అందం నటనకు నటనతో అందరిని మెప్పించినటువంటి సారా అర్జున్ తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమా( Ponniyin Selvan )లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ప్రస్తుతం 19 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి ఈమె త్వరలోనే హీరోయిన్గా రాబోతున్నారని తెలుస్తుంది.అయితే ఇప్పటివరకు ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తూ దాదాపు పది కోట్ల రూపాయల వరకు ఆస్తులు పోగు చేశారని తెలుస్తోంది.ఇక ఈమె సినిమాలలో నటించాలి అంటే దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే విషయం తెలియడంతో ఈ చిన్నారి చాలా కాస్ట్లీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube