ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

ప్రస్తుత రోజులలో చాలా మంది ప్రజలు అధిక బరువు సమస్యతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.అధిక బరువును దూరం చేసుకోవడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు.

 Disadvantages Of Drinking Lemon Water Daily,lemon Water,morning,toothache,dehydr-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే మరి కొంత మంది అధిక బరువును తగ్గించుకోవడానికి పరిగడుపున లెమన్ వాటర్( Lemon Water ) తాగుతున్నారు.దీని వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

కొంత మంది వైద్యులు కూడా ఇలా త్రాగడాన్ని ప్రోత్సహిస్తున్నారు.కానీ పరిగడుపున వేడి నీటిలో నిమ్మరసం తాగడం వల్ల కొన్ని చెడు ప్రభావాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.


Telugu Tips, Lemon, Telugu, Toothache-Telugu Health

వాటి గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే పరిగడుపున నిమ్మ రసం తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి.నిమ్మకాయలలో అసిడిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.దీని వల్ల దంతాల ఎనామిల్( Tooth Enamel ) దెబ్బ తింటుంది.ఇంకా చెప్పాలంటే ఉదయం సమయంలో ఏమి తినకుండా నిమ్మరసం తాగడం వల్ల చాలా మంది డిహైడ్రేషన్ కు గురవుతారు.నిమ్మకాయలో ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.

ఇది మూత్రపిండాలలో మూత్ర ఉత్పత్తి పెంచుతుంది.అందువల్ల సరైన విధంగా మాత్రమే నిమ్మకాయ నీటిని తాగాలి.

Telugu Tips, Lemon, Telugu, Toothache-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే పరిగడుపున నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎముకలకు హాని కలుగుతుంది.దీని వల్ల ఎముకలలో ఉండే క్యాల్షియం తగ్గిపోతుంది.దీంతో ఎముకలు బలహీనంగా( Weak Bones ) మారి విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.పరిగడుపున ఎక్కువగా నిమ్మకాయ రసం తాగితే మూత్ర విసర్జనకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి.

తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఆరోగ్య నిపుణుల ప్రకారం నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

చాలామంది బరువు తగ్గడానికి ఉదయం పూట దీనిని తీసుకుంటూ ఉంటారు.కానీ నిపుణుల సలహా లేకుండా పరిగడుపున నిమ్మరసం అసలు తాగకూడదు.

అంతే కాకుండా నిమ్మ రసం తాగితే వెంటనే ఎలాంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube