సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి.ఈ క్రమంలో ఒక్కోసారి చూసిన వీడియోలు చాలా కలవరనికి గురి చేస్తాయి.
తాజాగా అటువంటి రకానికి చెందిన వీడియో ఒకటి ఇక్కడ వైరల్ కావడం మనం గమనించవచ్చు.సదరు వీడియోని చూసిన జనాలు ఎయిర్‌పోర్టు( Airport )లో మరీ ఇంత ఘోరంగా దోచుకుంటారా? అంటూ అవాక్కవుతున్నారు.అవును, అమెరికాలోని మియామీ విమానాశ్రయంలో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.

వివరాల్లోకి వెళితే, అమెరికాలోని మియామీ విమానాశ్రయం( Miami Airport )లో విమాన ప్రయాణికుల బ్యాగుల తనిఖీ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది బ్యాగుల్లో ఉన్న డబ్బులని కాజేశారు.దాంతో ఈ వీడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ నేపథ్యంలో ప్రయాణికుల బ్యాగుల నుంచి డబ్బులు దొంగిలించిన ఇద్దరు సిబ్బందిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు నిందితులతోపాటు మరో మహిళా సిబ్బంది ఒక ముఠాగా ఏర్పడి ప్రయాణికుల బ్యాగుల్లోని డబ్బులు, ఇతర వస్తువులు చోరీ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

ఈ క్రమంలో పోలీసులు వారినుండి విస్తుపోయే వివరాలను సేకరించారు.అలా ఆ ముఠా ప్రతీ రోజు సుమారు 600 నుంచి వెయ్యి అమెరికా డాలర్లు వరకు దోచుకుంటారని తెలుసుకున్న పోలీసులు అవాక్కయరు.ప్రస్తుతం పోలీసులు వారిపైన కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
కాగా ఈ వీడియో పైన నెటిజనం రకరకలుగా స్పందిస్తున్నారు.దాదాపుగా వారిని అందరూ విమర్శిస్తున్నారు.
ఈ తరుణంలో కొంతమంది జనం వారి డబ్బులు కూడా అదేవిధంగా పోగొట్టుకున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.ఇదంతా ఆ దొంగల పనేనా అంటూ నోళ్లెళ్లబెడుతున్నారు.
మరికొందరు సదరు విమానాశ్రయం నిర్వహకులను కూడా బాగా యేసుకుంటున్నారు.







