కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ఇరు పక్షాల వాదనలు ముగిశాయి.
అనారోగ్య కారణాల నేపథ్యంలో పదిహేను రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టును కోరారు.అయితే దీనిపై సీబీఐ జైలులోనే ఆయనకు హెల్త్ చెకప్ నిర్వహిస్తున్నట్లు న్యాయస్థానానికి తెలిపింది.
ఈ క్రమంలో ఇరు పక్షాలు వాదనలు విన్న సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది.అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.







