మన టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు జగపతి బాబు.( Jagapathi Babu ) ఈయనని ట్రేడ్ నేటి తరం శోభన్ బాబు అని పిలిచేవారు.
అలాంటి ఇమేజి ని సంపాదించుకున్నాడు.ప్రముఖ నిర్మాత రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా( Producer Rajendra Prasad ) ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జగపతి బాబు కి తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఇతను హీరో గా పనికి రాడు, గొంతు ఛండాలంగా ఉంది అంటూ కామెంట్స్ చేసెవారు అప్పట్లో.అయితే అదే హీరో ఆ తర్వాత హిట్ మీద హిట్ కొట్టి ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చి స్టార్ స్టేటస్ ని సంపాదించాడు.
అయితే ఎంత పెద్ద హీరో అయినా ఒకా వయస్సు వచ్చిన తర్వాత హీరో గా ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే.అలా జగపతి బాబు కి కూడా హీరో గా మార్కెట్ మొత్తం పోయింది.

అందువల్ల ఆయనకీ అవకాశాలు రావడం తగ్గిపోయాయి, అలాంటి సమయం లో ఆయనకీ బోయపాటి శ్రీను మరియు బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన లెజెండ్ చిత్రం లో( Legend Movie ) విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.వరుసగా విలన్ రోల్స్ మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు.
ఇదంతా పక్కన పెడితే జగపతి బాబు అప్పట్లో బాలనటుడిగా( Child Artist ) ఒక సినిమా చేసాడట.ఈ విషయం చాలా మందికి తెలియదు.అప్పట్లో జగపతి బాబు తండ్రి రాజేంద్ర ప్రసాద్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ లో కూడా ఎన్నో సినిమాలు తీసాడు.

అలా ఆరోజుల్లో ఆయన తమిళ స్టార్ హీరో శివాజీ గణేశన్, జయసుధ మరియు శ్రీదేవి కాంబినేషన్ లో ‘పత్తాకత్తి భైరవన్’( Pattakkathi Bhairavan ) అనే చిత్రం నిర్మించాడు.ఈ సినిమా కమర్షియల్ గా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్.ఇందులో ఒక చిన్న పాత్రలో బాలనటుడిగా జగపతి బాబు కనిపిస్తాడట.
దీనితో పాటు అంతకు ముందు 1974 వ సంవత్సరం లో విడుదలైన మంచి మనుషులు( Manchi Manushulu Movie ) అనే చిత్రం లో కూడా ఆయన బాలనటుడిగా నటించాడు, ఈ సినిమాలో శోభన్ బాబు మరియు మంజుల హీరోహీరోయిన్లు గా నటించారు.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన బాలనటుడిగా కొనసాగించలేదు, చక్కగా చదువుకొని పెద్దయ్యాక హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.
సినిమాల్లో హీరో కాకముందే జగపతి బాబు ఇలా బాలనటుడిగా నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు.