పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోవాలా.. మోదీ అలానే గొప్ప అయ్యారుగా.. మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ నటి మాధవీలత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు.

 Actress Madhavi Latha Sensational Comments About Marriage,marriage,actress Madha-TeluguStop.com

తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి గురించి నెటిజన్ చేసిన కామెంట్ కు మాధవీలత ధీటుగా జవాబిచ్చారు.మాధవీలత పెళ్లికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

మాధవీలత వయస్సు 34 సంవత్సరాలు కాగా వ్యక్తిగత కారణాల వల్ల ఆమె పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

Telugu Actressmadhavi, Cm Yogi, Pm Modi-Movie

తాజాగా మాధవీలత షేర్ చేసిన వీడియోలలో పెళ్లి( Madhavi Latha Marriage ) గురించి ప్రస్తావన తీసుకొచ్చారు.అయితే ఒక నెటిజన్ హర్ట్ అయ్యేలా కామెంట్ చేసిన నేపథ్యంలో మాధవీలత ఘాటుగా స్పందించారు.పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ భూమిపై బ్రతికే అర్హత లేదా అని ఆమె అన్నారు.

పెళ్లి చేసుకోకుండా ఉంటే నిజంగానే వాళ్లకు బలుపు ఉంటుందా అని మాధవీలత చెప్పుకొచ్చారు.
పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచి అవుతానా అని ఆమె కామెంట్ చేశారు.

మీ మాటలను బట్టి పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టేనని మాధవీలత వెల్లడించారు.మీరు ఏ విధంగా ఉన్నారంటే పెళ్లి చేసుకోని వాళ్లంతా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

ప్రధాని మోదీ(PM Modi ), సీఎం యోగి, అబ్దుల్ కలాం, వివేకానంద పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా అని ఆమె పేర్కొన్నారు.

Telugu Actressmadhavi, Cm Yogi, Pm Modi-Movie

అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా అయితే మీరే నాకు పెళ్లి చేయండని మాధవీలత అన్నారు.మాధవీలత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social Media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.మాధవీలత కామెంట్ కు నెటిజన్లు సైతం తమదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మాధవీలతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube