నల్లగొండ జిల్లా: అడవిదేవులపల్లి మండల ( Adavidevulapally )కేంద్రంలో వాటర్ ట్యాంక్( Water tank ) శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలి పోతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాదాపు సంవత్సర కాలం నుంచి ట్యాంక్ ను శుభ్రం చేసింది లేదని,ట్యాంక్ పైకి ఎక్కడానికి ఏర్పాటు చేసిన ఇనుప నిచ్చెన ఇటీవలే తుప్పు పట్టి విరిగి పోయినందున పైకి ఎక్కి శుభ్రం చేసేందుకు వీలు లేకుండా పోయిందని, దానిని పునరుద్ధరణ చేయడమో,లేక ట్యాంక్ ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మాణం చేయడమో చేయకుండా వదిలేశారని,నిరంతరం ట్యాంక్ నుంచి వాటర్ లీక్ అవటం వల్ల ఎప్పుడు కూలిపోతుందోతెలియక అటువైపుకు ప్రజలు వెళ్లడమే మానేశారని,ట్యాంక్ చుట్టూ వున్నవారుభయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు ట్యాంక్ పై భాగనా 10 అడుగుల రావి చెట్టు పెరగటంతో వారి భయం మరింత పెరిగిందని అంటున్నారు.అధికారులు తక్షణమే స్పందించి ఎలాంటి ప్రమాదం జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
.