ఈ మెకానిక్ తెలివికి సలాం కొట్టాల్సిందే.. ఏం చేశాడంటే?

చాలా మంది భారతీయులు వినూత్న ఆవిష్కరణలు చేస్తుంటారు.అయితే కేవలం కింది స్థాయిలో ఉండిపోవడంతో వారి ప్రతిభ( Talent ) ప్రపంచానికి తెలియడం లేదు.

 Mechanic Makes A Cozy Chair From Bike Suspension And Disc Brakes Video Viral Det-TeluguStop.com

అయితే సోషల్ మీడియా వల్ల చాలా మందిలో ఉన్న ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది.వారి వీడియోలను చూసిన వారంతా ప్రతిభావంతులను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

ఇదే కోవలో ఓ మెకానిక్‌ను( Mechanic ) ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.ఇంజినీర్లు కూడా అతడి తెలివి ముందు బలాదూర్ అని కామెంట్లు చేస్తున్నారు.

అంతలా అతడు ఏం చేశాడో అని ఆలోచిస్తున్నారా? కేవలం బైక్ మెకానిక్ అయిన ఆ కుర్రాడు తాను మెకానిక్ పనులు చేసేటప్పుడు వీలుగా ఉండే చిన్న కుర్చీని చేసుకున్నాడు.

అందులో ప్రత్యేకత ఏమిటంటే ఆ కుర్చీని కేవలం బైక్ విడి భాగాలతో( Bike Parts ) తయారు చేశాడు.దానిని చూసిన వారంతా అతడి తెలివి అమోఘమని కీర్తిస్తున్నారు.దీని గురించి తెలుసుకుందాం.

బైక్‌లను రిపేర్ చేసే సమయంలో మెకానిక్‌లు కూర్చోవాల్సి ఉంటుంది.అయితే కుర్చీలు ( Chair ) వేసుకుంటే అవి వారికి అనుకూలంగా ఉండవు.

పోనీ స్టూల్స్ వేసుకుంటే వారికి సౌకర్యంగా ఉండదు.హైట్ విషయంలో వాటి వల్ల ఇబ్బందులు ఉంటాయి.

దీంతో ఓ మెకానిక్ తన వద్ద ఉన్న బైక్ విడి భాగాలతో తనకు అనువుగా ఉండే కుర్చీని చేశాడు.

ఈ కుర్చీని తయారు చేయడానికి మోటార్‌సైకిల్ డిస్క్ బ్రేక్, షాకర్, ఇనుప రాడ్‌లు మరియు నట్స్ మరియు బోల్ట్‌లను ఉపయోగించారు.కుర్చీలో కూర్చొని బైక్‌ను ఎంత హాయిగా రిపేర్ చేస్తున్నాడో వైరల్ క్లిప్‌లో మీరు చూడవచ్చు.చక్కగా దీనిపై కూర్చుని బైక్‌లను అతడు చకచకా రిపేర్లు చేస్తున్నాడు.

దీనిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.ఈ దేశీ కుర్చీకి( Desi Chair ) ఇంటర్‌నెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ పేజీ సాయ్‌పెర్సీ1లో షేర్ చేశారు.దీనికి ఇప్పటికే కోటి కంటే ఎక్కువ వ్యూస్ దక్కాయి.7 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.ఇక అతడి తెలివిని ప్రశంసిస్తూ వేలల్లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube