స్మార్ట్‌వాచ్‌లు హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు సెక్యూరిటీ ఫీచర్లను కూడా అందిస్తున్నాయి.వీటితో పిల్లలపై ఒక కన్నేసే అవకాశం కూడా ఉంటుంది.
కాగా కిడ్స్ కోసం చాలా తక్కువ స్మార్ట్‌వాచ్‌లు మాత్రమే భారతీయ మార్కెట్లో తక్కువగానే అందుబాటులో ఉన్నాయి.ఈ విషయాన్ని గుర్తించిన ప్రముఖ దేశీయ వేరబుల్స్ తయారీ కంపెనీ నాయిస్ ‘నాయిస్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్‌వాచ్’( Noise Explorer Smartwatch ) పేరుతో భారతదేశంలో కిడ్స్ స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది.దీని ధరను రూ.5,999గా నిర్ణయించింది.

నాయిస్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్‌వాచ్ అనేది పిల్లల కోసం GPS స్మార్ట్‌వాచ్, ( Live GPS Tracking ) ఇది తల్లిదండ్రులు తమ పిల్లల లొకేషన్ ట్రాక్ చేయడానికి, వీడియో కాల్‌లు చేయడానికి, సేఫ్ జోన్లను సెట్ చేయడానికి అనుమతిస్తుంది.ఇందులో 1.4 TFT డిస్‌ప్లే, 2MP ఫ్రంట్ కెమెరా, స్టెప్ కౌంటర్, అలారం, స్టాప్‌వాచ్, టైమర్, కాలిక్యులేటర్, స్కూల్ మోడ్ కూడా ఉన్నాయి.స్మార్ట్ వాచ్ 3 రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుంది.
నీరు మరియు ధూళిని తట్టుకుంటుంది.ఇది వండర్ పింక్, ఫాంటమ్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది.

నాయిస్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్‌వాచ్ అందిస్తున్న కొన్ని ముఖ్య ఫీచర్ల గురించి తెలుసుకుంటే ఇందులో లైవ్ GPS ట్రాకింగ్ తల్లిదండ్రులు తమ పిల్లల లొకేషన్ రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.2-వే వీడియో కాలింగ్ ఫీచర్ తల్లిదండ్రులు తమ పిల్లలకు వీడియో కాల్స్( Video Calls ) చేసేవారు ఏం చేస్తున్నారు తెలుసుకోవచ్చు.సేఫ్ జోన్‌తో తల్లిదండ్రులు సేఫ్ జోన్లను సెట్ చేయవచ్చు, వారి పిల్లలు సేఫ్ జోన్‌ను విడిచిపెట్టినట్లయితే అలర్ట్స్ వెంటనే పొందవచ్చు.ఇందులో అందించిన స్కూల్ మోడ్ పాఠశాల సమయాల్లో అనవసరమైన ఫీచర్‌లను నిలిపివేస్తుంది.
నాయిస్ ఎక్స్‌ప్లోరర్ స్మార్ట్‌వాచ్ అనేది తల్లిదండ్రులు తమ పిల్లల లొకేషన్, యాక్టివిటీలను ట్రాక్ చేయడానికి ఒక గొప్ప మార్గం.







