కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ దళపతి( Vijay Thalapathy ) గత కొంత కాలం నుంచి తన తండ్రితో విభేదాల కారణంగా తన తండ్రికి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన సినిమా పనులలో ఎంతో బిజీగా ఉండగా తన తండ్రి చంద్రశేఖర్ ( Chandrasekhar ) మాత్రం విజయ్ కి తెలియకుండా ఆయన పేరు మీద ఒక పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేశారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ తన తండ్రిపై కోపంతో ఉన్నారని అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక ఈ వివాదం నుంచి ఈయన తన తండ్రికి దూరమయ్యారని తెలుస్తుంది.అప్పటినుంచి ఇప్పటివరకు తండ్రితో కనీసం మాట్లాడనటువంటి ఈయన ఉన్నఫలంగా తన తల్లిదండ్రులను కలిసారని తెలుస్తోంది.విజయ్ తండ్రి చంద్రశేఖర్ అనారోగ్యానికి గురయ్యారు.
చెన్నైలోనే ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఈయనకు గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స చేశారు.ఇలా తండ్రి అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలియడంతో విజయ్ దళపతి తన పంతాలన్నీ పక్కన పెట్టి మరి తన తండ్రిని కలిశారట.

కొద్దిరోజుల నుంచి అమెరికా( America )లో ఉన్నటువంటి విజయ్ రెండు రోజుల క్రితం చెన్నై వచ్చారు.ఇలా చెన్నై వచ్చిన వెంటనే ఈయన తన తండ్రిని కలిసి ఆయనని పరామర్శించి తన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్టు తెలుస్తుంది.చాలా సంవత్సరాల తర్వాత తన కుమారుడు తనతో మాట్లాడటంతో చంద్రశేఖర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని అలాగే తన తల్లి శోభా ( Sobha ) మాత్రం తన కుమారుడికి ఇష్టమైనటువంటి వంటలను కూడా తయారు చేసి కొడుకుకు ప్రేమతో కడుపునిండా భోజనం పెట్టారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే విజయ్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఏది ఏమైనా తండ్రి ఇబ్బందులలో ఉన్నప్పుడు విజయ్ తన తండ్రిని పలకరించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







