ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు పట్టించుకోవడం లేదు పాపం..!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వచ్చిన సినిమా ల్లో ఏ ఒక్కటి కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోలేదు.మొదట్లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా మినహా ఏది కూడా కమర్షియల్ గా, టాక్ పరంగా ఆహా ఓహో అనిపించుకోలేదు.

 Srikanth Addala Directional Pedakaapu Movie Update , Srikanth Addala , Virat K-TeluguStop.com

అలాంటి శ్రీకాంత్ అడ్డాల గత చిత్రం వెంకటేష్ తో( Venkatesh ) ఒక రీమేక్ చిత్రం చేయడం జరిగింది.ఆ సినిమా కూడా కమర్షియల్‌ గా అంతంత మాత్రమే అనిపించింది.

ఈ దర్శకుడు తన పట్టుదలను వీడకుండా కొత్త సినిమాను తీశాడు.ఈసారి ఏకంగా పెద్ద కాపు ( Pedakaapu movie )అనే టైటిల్ తో ప్రాంచైజీని మొదలు పెట్టాడు.

Telugu Anasuya, Pedakaapu, Srikanth Addala, Telugu, Tollywood, Top, Venkatesh, V

మొదటి భాగం ను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు.అంతే కాకుండా సినిమా ట్రైలర్‌ ను కూడా విడుదల చేయడం జరిగింది.సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మీడియా వర్గాల్లో కాస్త ఆసక్తి తప్ప జనాల్లో ఎక్కడ కూడా ఆసక్తి కనపడటం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రచారం చేసినా కూడా ఏ ఒక్కరు పట్టించుకోక పోవడం తో అసలు విడుదల అయ్యే వరకు అయినా కనీసం సినిమా ను జనాలు గుర్తించేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anasuya, Pedakaapu, Srikanth Addala, Telugu, Tollywood, Top, Venkatesh, V

ఇలాంటి సినిమా లకు ముందస్తు క్రేజ్‌, బజ్ క్రియేట్‌ అవ్వడం సాధ్యం కాదు.కనుక శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా తో సక్సెస్ కొడితే తప్ప జనాలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.శ్రీకాంత్‌ అడ్డాల( Srikanth addala ) ఈ సినిమా కు దర్శకుడిగా వ్యవహరించడం తో పాటు కీలక పాత్రలో కనిపించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ఈ సినిమా లో అంతా కూడా కొత్త వారే ఉండటం వల్ల కూడా సినిమా కు పెద్దగా బజ్ క్రియేట్‌ అవ్వడం లేదు అనే టాక్‌ వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube