ఏపీలో ఏం జరుగుతుందో కేంద్రానికి కనపడటం లేదా అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టులో మీకు భాగం ఉందా అని ప్రశ్నించిన అయ్యన్న ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జీ సదస్సు పెట్టడం వలన ఏం ఉపయోగమో చెప్పాలని అయ్యన్న అన్నారు.పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడరా అని మండిపడ్డారు.
రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ దిగజారిపోయాయన్న అయ్యన్నపాత్రుడు చంద్రబాబును ఏ ఇష్యూలో అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.కేబినెట్ నిర్ణయం కాబట్టి అప్పటి మంత్రులను కూడా అరెస్ట్ చేయాలన్నారు.
మీరు దొంగ కాబట్టి అందరిని జైలులో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.







