Balakrishna : చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రభావం బాలకృష్ణ సినిమాలకు దూరం చేయనుందా?

ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే.టీడీపీ అధినేత మాజీ చంద్రబాబు నాయుడుని అరెస్టు( Chandrababu Naidu arrest ) చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

 Ap Politics Will Nandamuri Balakrishna Gives Break To Movies After Tdp Supremo-TeluguStop.com

దీంతో చంద్రబాబు నాయుడుకి అటు నారా ఫ్యామిలీ నుంచి ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి అలాగే టీడీపీ నేతలు నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.అధికారంలో ఉన్న జగన్ ఇప్పుడు ఏమైనా చేస్తున్నావేమో ఒక్కసారి పదవి పోయాక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అంటూ టీడీపీ నేతలు వైఎస్ జగన్ హెచ్చరిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Ys Jagan-Movie

ఇకపోతే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ( Balakrishna ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం బాలయ్య బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా గడుపుతున్నారు.కేవలం ఎక్కువ శాతం సినిమాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు బాలయ్య బాబు.సాధారణంగా టీడీపీ తరఫున ఎన్నికల సమయంలో ప్రచారంలో మాత్రమే పాల్గొనే బాలయ్య బాబు తాజాగా ఆయన వియ్యంకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఒక్కసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బరిలోకి దిగారు.

ఇటువంటి సమయంలో టిడిపిలో బాలకృష్ణ యాక్టివ్ రోల్ తీసుకోవడంతో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త కొత్త ఉత్సాహం నింపుతున్నారు.

Telugu Ap, Chandrababu, Ys Jagan-Movie

గతంలో ఎప్పుడు లేని విధంగా తాజాగా ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా ఆ ప్రెస్ మీట్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ.సీఎం జగన్ ను( CM jagan ) టార్గెట్ చేస్తూ విమర్శలు గుర్తించడంతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చాడు.ఇదే దూకుడు ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఉంటుందని హెచ్చరించారు.

దీంతో బాలకృష్ణ రాష్ట్రమంతా పర్యటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడం అలాగే ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వినిపిస్తుండడంతో బాలకృష్ణ కొంతకాలం పాటు సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

బాబు కూడా కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) అక్టోబర్ లో విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి కావడంతో బాలయ్య బాబు ఇక పూర్తిగా పొలిటిక్స్ పై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube