సలార్ వాయిదా పై స్పందించిన టీం... కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన తాజా చిత్రం సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంభలే ఫిలిమ్స్ మేకర్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇది వరకు వెల్లడైంది.

 Prabhas Salaar Movie Postponed Makers Give Clarity, Salaar, Prabhas, Prashanth N-TeluguStop.com

దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు.ఈ సినిమా విడుదల తేదీ కోసం ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా సలార్ సినిమా( Salaar Movie ) వాయిదా పడిందనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక ఈ సినిమా గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో అభిమానులలో ఏదో ఒక మూల ఈ సినిమా విడుదల అవుతుంది అంటూ చిన్న ఆశలు ఉండేవి అయితే తాజాగా ఈ వార్తలపై సలార్ టీం స్పందించారు.ఈ సందర్భంగా టీం స్పందిస్తూ ఈ సినిమా విడుదల విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మేకర్స్ స్పందిస్తూ.సలార్ సినిమాని ముందుగా అనుకున్న తేదీన విడుదల చేయలేకపోతున్నామని మేము చింతిస్తున్నాము.ఈ సినిమాపై మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అయితే త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాము అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టు తెలియజేశారు.

ఇలా వాయిదా పడిన విషయాన్ని తెలియజేస్తూ కొత్త తేదీని ప్రకటించకపోవడంతో అభిమానులు మేకర్స్ పై మండిపడుతున్నారు.మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటిసారి శృతిహాసన్( Shruti Haasan ) హీరోయిన్గా నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube