సలార్ వాయిదా పై స్పందించిన టీం… కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నటించిన తాజా చిత్రం సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంభలే ఫిలిమ్స్ మేకర్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇది వరకు వెల్లడైంది.

దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు.ఈ సినిమా విడుదల తేదీ కోసం ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి.

"""/" / ఈ విధంగా సలార్ సినిమా( Salaar Movie ) వాయిదా పడిందనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక ఈ సినిమా గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో అభిమానులలో ఏదో ఒక మూల ఈ సినిమా విడుదల అవుతుంది అంటూ చిన్న ఆశలు ఉండేవి అయితే తాజాగా ఈ వార్తలపై సలార్ టీం స్పందించారు.

ఈ సందర్భంగా టీం స్పందిస్తూ ఈ సినిమా విడుదల విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

"""/" / ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మేకర్స్ స్పందిస్తూ.సలార్ సినిమాని ముందుగా అనుకున్న తేదీన విడుదల చేయలేకపోతున్నామని మేము చింతిస్తున్నాము.

ఈ సినిమాపై మీరంతా చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అయితే త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాము అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్టు తెలియజేశారు.

ఇలా వాయిదా పడిన విషయాన్ని తెలియజేస్తూ కొత్త తేదీని ప్రకటించకపోవడంతో అభిమానులు మేకర్స్ పై మండిపడుతున్నారు.

మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొదటిసారి శృతిహాసన్( Shruti Haasan ) హీరోయిన్గా నటించారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

నా కోసం 7/జి బృందావన్ కాలనీ క్లైమాక్స్ మార్చారు : రకుల్ ప్రీత్