విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.కేశఖండన శాల వద్ద నిన్న కొండ చరియలు విరిగిపడటంతో పలు వాహనాలు ధ్వంసం అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు.మరోవైపు ప్రమాదకరంగా ఉన్న బండరాళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు.
మరోసారి కొండ చరియలు విరిగి పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు.ఈ మేరకు ఐఐటీ చెన్నై జియాలజీ విభాగం, మైనింగ్ అధికారుల సలహాలతో చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు నిన్న కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.