విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత

విజయవాడలోని ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.కేశఖండన శాల వద్ద నిన్న కొండ చరియలు విరిగిపడటంతో పలు వాహనాలు ధ్వంసం అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఇంద్రకీలాద్రికి వెళ్లే ఘాట్ రోడ్డును మూసివేశారు.

మరోవైపు ప్రమాదకరంగా ఉన్న బండరాళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు.మరోసారి కొండ చరియలు విరిగి పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ మేరకు ఐఐటీ చెన్నై జియాలజీ విభాగం, మైనింగ్ అధికారుల సలహాలతో చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు నిన్న కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

“క” సినిమాతో కిరణ్ అబ్బవరం ఖాతాలో సంచలన రికార్డ్.. రేంజ్ పెరిగిందిగా!