స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి( TDP chief Chandrababu ) ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం తెలిసిందే.చంద్రబాబు అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్ర బంద్ నిర్వహించాయి.
ఈ క్రమంలో రాజకీయ కక్షతో అని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినట్లు టీడీపీ( TDP ) పార్టీ నేతలు మిగతా పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.ఇలా ఉంటే చంద్రబాబు సెంట్రల్ జైలుకు వెళ్లిన తర్వాత మొట్టమొదటిసారి నారా లోకేష్( Nara Lokesh ) మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తన తండ్రి చంద్రబాబు ఎక్కడ తప్పు చేయలేదని అన్నారు.మనీలాండరింగ్ జరిగిందని ఈడీ కూడా స్పష్టం చేసిందని పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా డబ్బులు వచ్చినట్లు ప్రభుత్వం నిరూపించగలదా అని సవాలు విసిరారు.ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్ చంద్రబాబు అరెస్టుతో ఒంటరి అయిపోయానని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.
దానికి లోకేష్ సమాధానం ఇస్తూ ఈ కష్ట సమయంలో తాను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు.చంద్రబాబు అరెస్టు దృష్ట్యా యువగళం పాదయాత్రకి తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు.
అన్ని సర్దుకున్నాక త్వరలో మళ్లీ ప్రారంభించబోతున్నట్లు లోకేష్ ప్రకటించారు.