రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు.. ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగులు( Government employees ) తమకు 60 ఏళ్లు వచ్చే వరకు చాలా సర్వీస్ చేస్తారు.తమ విధి నిర్వహణలో చాలా మంది ప్రజల కోసం కష్టపడతారు.

 Good News For Retired Employees Govt Job Through Interview , Good News , Lates-TeluguStop.com

అలాంటి వారు రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండాల్సి వస్తోంది.అయితే ఖాళీగా ఉండడం వారికి ఏ మాత్రం నచ్చదు.

ఏదో ఒక పని చేయాలని అనిపిస్తుంది.అంతేకాకుండా ఏ పనీ చేయకపోతే లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది.

అయితే కొందరు రిటైర్ అయిన తర్వాత తమకు వచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తారు.

Telugu Job, Interview, Latest, Bengal-Latest News - Telugu

ఇంకొందరు సొంత ఊళ్లకు వెళ్లి సెటిల్ అవుతారు.కొందరు మాత్రం ప్రైవేట్ ఉద్యోగాలలో సైతం చేరి కష్టపడుతుంటారు.అయితే రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తాజాగా ఓ నోటిఫికేషన్ ఇచ్చింది.ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అయితే ఆ ఉద్యోగాలకు మాత్రం కేవలం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.ఏడాది వ్యవధి గల ఆ ఉద్యోగానికి చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

Telugu Job, Interview, Latest, Bengal-Latest News - Telugu

పశ్చిమ బెంగాల్( West Bengal ) లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఇటీవల అదనపు ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగానికి కేవలం రిటైర్డ్ ఉద్యోగులు మాత్రమే అర్హులు.ఈ ఉద్యోగ ప్రకటనను జిల్లా అధికార యంత్రాంగం తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించింది.‘బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ డెవలప్‌మెంట్‘ కింద ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది కాల వ్యవధికి ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.

అవసరం అయితే ఉద్యోగ వ్యవధిని ఏడాది కంటే ఎక్కువ కాలం పొడిగించే వీలుంది.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్పెక్టర్ / ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ / హెడ్ క్లర్క్ / యుడి క్లర్క్‌గా ఉద్యోగ విధులు నిర్వర్తించి రిటైర్ అయిన వారు ఈ పోస్టుకు సెప్టెంబర్ 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అయితే దరఖాస్తుదారుల వయసు 64 ఏళ్లు దాటకూడదు. సెప్టెంబర్ 26వ తేదీన నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దాని ద్వారా ఉద్యోగిని ఎంపిక చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube