Samantha : విమానాశ్రయంలో ఆ వ్యక్తిని చూసిన వెంటనే పారిపోయిన సమంత.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్న విషయం తెలిసిందే.

 Samantha Who Ran Away After Seeing Him At The Airport Lost Her Dignity-TeluguStop.com

గత కొంతకాలంగా మయూసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స నిమిత్తం సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.అందులో భాగంగానే ప్రస్తుతం విదేశాలలో ఉంటోంది సమంత.

కాగా తాజాగా సమంత నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అని అందుకుంది.

అంతేకాకుండా సమంతకు ఈ సినిమా కాస్త ఊరట నిచ్చింది అని చెప్పవచ్చు.ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది సమంత.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా( Social media )లో సమంతకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.తాజాగా సామ్ తెల్లవారు జామున ముంబై విమానాశ్రయం లో దర్శనమిచ్చి అందరిని షాక్ కి గురి చేసింది.

అదేంటి సమంత అప్పుడే ఇండియాకి వచ్చేసింది.ట్రీట్మెంట్ అయిపోయిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రీట్మెంట్ అయ్యాకే ఆమె ఇండియాకి తిరిగి వచ్చిందా, లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద ఇండియాకి వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

అయితే ఆమె విమానాశ్రయం దిగగానే కమలేష్( Kamlesh ) అనే ఫోటోగ్రాఫర్ ని చూసి పరుగులు తీసింది.కానీ అతను సమంత ని పట్టుకొని ఫోటోలు తీసుకున్నాడు.మిమల్ని తప్పించుకొని ఇటు వచ్చేసాను అని అనుకున్నాను, కానీ ఇలా దొరికిపోయాను ఏంటి అంటూ సమంత క్యూట్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అది కాస్త ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube