విజయవాడలోని ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే సీఐడీ వాదనలు పూర్తయ్యాయని తెలుస్తోంది.
దీంతో న్యాయమూర్తి 15 నిమిషాలు విరామం ప్రకటించారు.విరామం అనంతరం చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరోసారి వాదనలు వినిపించనున్నారు.
ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ కోర్టులోనే ఉన్న చంద్రబాబు తానే స్వయంగా వాదనలు వినిపించారు.తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు కోర్టుకు వివరించారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వాదనలను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.
కాగా మరో రెండు గంటల పాటు కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉండగా న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకోనుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







