మొబైల్ వినియోగం బాగా పెరిగిన తరువాత సాధారణంగానే సోషల్ మీడియా( Social media ) హవా మొదలయ్యింది.మరీ ముఖ్యంగా మన భారతదేశంలో స్మార్ట్ఫోన్ వినియోగదారులు అందరు కూడా సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్నారు అని స్వయంగా సర్వేలే చెబుతున్నాయి.
అంతవరకు వెళ్లాల్సిన పనిలేదు.మన చుట్టూ ఒకసారి మనం పరిశీలిస్తే గనుక మనకి విషయం బోధ పడుతుంది.
ఇపుడు సగటు మనిషి తోటి మనిషితో కాకుండా యంత్రాలతో కాపురం చేస్తున్నాడు అనేది ఒక చేదు నిజం అని చెప్పుకోక తప్పదు.

ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యే ఎన్నో రకాల వీడియోలను చూడ్డానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇంటర్నెట్లోకి వచ్చే వీడియోలలో కొన్ని అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇంకొన్నిభయాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి.అంతేకాదండోయ్… ఎంతో మంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఇపుడు సోషల్ మీడియా అనేది అద్భుతమైన వేదికగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు.ఇలా సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఏకంగా పాపులారిటి పెంచుకోవడమే కాకుండా నేడు సినిమా అవకాశాలు అందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు.

అటువంటి టాలెంట్ ఇపుడు ఒక బుడ్డోడు చూపించాడు.అతని టాలెంట్ చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు మరి.ఇప్పుడు వరకు ఎంతోమంది ఎన్నో రకాల వాయిస్ లను మిమిక్రీ చేయడం చూశాము.కానీ ఇక్కడ ఒక బుడ్డోడు చేసిన మిమిక్రీ( Mimicry ) అయితే వేరే లెవెల్ అని అంటున్నారు జనాలు.ఆర్ఎక్స్ 100( RX100 bike ) బైక్ వెళుతుందేమో అన్నట్లుగా ఆ బుడ్డోడు అతని నాలుకతో శబ్దం చేశాడు.
ఒక 15 ఏళ్ల బాలుడు అచ్చం తన నాలుక సహాయంతో యువతకు ఇష్టమైన యమహా ఆర్ఎక్స్ 100 బైక్ నుంచి వచ్చే సౌండ్లు మిమిక్రీ చేయడంతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది.కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి.







