తన నటన అలాగే నాట్యంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన భానుప్రియ ( Bhanupriya ) ఇప్పటి ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఈమె తన నాట్యంతో అప్పటి స్టార్ హీరోలను సైతం గజగజా వణికించిందట.

మరీ ముఖ్యంగా ఒకప్పుడు చిరంజీవి ( Chiranjeevi ) కి పోటీగా డ్యాన్స్ ఎవరు చేసేవారు కాదు.కానీ ఆయనకి పోటీగా చేసి ఆయన్నే భయపెట్టిన పేరు భానుప్రియ కి వచ్చింది.అలా భానుప్రియ దాదాపు 110 సినిమాలకు పైగా హీరోయిన్ గా చేసింది.తెలుగులోనే కాకుండా హిందీ,తమిళ భాషల్లో హీరోయిన్ గా చేయడమే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా చేసింది.అయితే అలాంటి భానుప్రియ ని నమ్మించి మోసం చేశాడనే కోపంతో ఆ స్టార్ డైరెక్టర్ ని భానుప్రియ తల్లి ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొట్టిందట.మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు కొట్టింది అనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.సితార ( Sitara ) అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన భానుప్రియ తర్వాత ఎందరో స్టార్ హీరోల సరసన జతకట్టింది.అయితే స్టార్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భానుప్రియ కి ఎక్కువ హిట్స్ పడ్డాయి.

అయితే అప్పట్లో వీరి మధ్య ఏదో నడిచింది అనే వార్తలు కూడా ఉన్నాయి.అంతేకాదు నిజంగానే భానుప్రియ అందానికి డైరెక్టర్ వంశీ ( Director Vamshi ) ముగ్ధుడయ్యారట.ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలని నేరుగా భానుప్రియ తల్లి దగ్గరికి వెళ్లి తన లవ్ మేటర్ చెప్పారట.అయితే మొదట్లో సైలెంట్ గానే ఉన్న భానుప్రియ తల్లి అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుందట.ఇక బ్యాగ్రౌండ్ తెలుసుకున్న భానుప్రియ తల్లి ( Bhanupriya Mother )కి చాలా కోపం వచ్చిందట.ఎందుకంటే వంశీకి అప్పటికే పెళ్లయిందట.
ఇక ఈ విషయం తెలిసి భానుప్రియ తల్లి కోపంతో ఉడికిపోయి సరాసరి వంశీ ఇంటికి వెళ్లి నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి దాని గొంతు కోయాలని చూస్తావా.ఇప్పటికే పెళ్లైన నువ్వు మళ్ళీ నా కూతుర్ని చేసుకుంటానన్నావా అని చెప్పుతో కొట్టిందట.

ఇక అప్పట్లో ఈ మ్యాటర్ పెద్ద సంచలనం సృష్టించింది.ఇక ఆ తర్వాత వంశీ భానుప్రియ తో సినిమాలు చేయడం మానేశారట.ఇక భానుప్రియ గ్రాఫిక్ డిజైనర్ అయినా ఆదర్శ కౌశల్ ( Adarsh Kaushal ) ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ వీరి ప్రేమ చివరి వరకు ఉండలేకపోయింది.
ఎందుకంటే 2018లోనే భానుప్రియ భర్త గుండెపోటుతో మరణించారు.







