తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్.
ఈమె బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవల కాలంలో టాలీవుడ్( Tollywood ) తో పోల్చుకుంటే బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది.ఇక తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్, మంచు మనోజ్, రామ్ పోతినేని, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది.ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫోటోలు ధర వివరాలు వైరల్ గా మారాయి.ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ ( Mercedes Benz )కారు కొనుగోలు చేసింది.ఆ కారు దగ్గర నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది రకుల్.అంతేకాకుండా అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసుకుంది.అయితే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు నెటిజెన్స్ ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇంకొందరు ఆ కారు గురించి సోషల్ మీడియాలో సర్చ్ చేయగా ఆ కారు ధర తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

అయితే రకుల్ కొనుగోలు చేసిన లగ్జరీ బెంజ్ కారు విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.దీంతో ఆ కారు ధర తెలిసి అందరూ ఒక్కసారిగా నోరెళ్ళబెడుతున్నారు.
ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ నటుడు జాకీ బగ్నానితో( Jackie Bagnani ) ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.ఇక ఆ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చిన ప్రతిసారి ఆమె అందుకు సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ తెలుపుతాను అని తెలిపింది.







